ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్న ఆమనగల్ నాయకులు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఆమనగల్లు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.