పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల దుర్భర స్థితి, రోడ్డు లేక అవస్థలు
రిపోర్టర్: రాము
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పందులవానివలస గ్రామం దశాబ్దాలుగా కనీస వసతులకు నోచుకోలేదు. 40 గదబ గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో రోడ్డు, విద్యుత్, వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేవు. మృతదేహాలను బురదలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. అధికారులు స్పందించి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.