మార్చాల గ్రామంలో వైభవంగా పోచమ్మ బోనాల వేడుక
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో శనివారం రాత్రి పోచమ్మ బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ, కొత్త కుండలలో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని వీధులన్నీ భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.