టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్.. టీ20లకు స్టార్ ఆల్‌రౌండర్లు ఫిట్

రిపోర్టర్: అశోక్ స్థలం: India

అఫ్గానిస్తాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చారు. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈలో ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకుని ఢిల్లీలో భారత జట్టుతో కలిసిపోయారు.