విజయనగరం ఆదిత్య డిగ్రీ కాలేజీలో గూగుల్ సెంటర్ ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఐసీటీ అకాడమీ సహకారంతో గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమైంది. విద్యార్థినుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి, ఐసీటీ అకాడమీ స్టేట్ హెడ్ ఎస్.దినకర్ రెడ్డి, రిలేషన్ షిప్ మేనేజర్ పి.రాహుల్ పాల్గొన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సూచించారు.