గణేష్ ఉత్సవాల నిర్వహణపై బెల్లంపల్లిలో పోలీసుల సమన్వయ సమావేశం.. హాజరుకానున్న ఏసీపీ!
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గణేష్ ఉత్సవాల శాంతియుత నిర్వహణే ధ్యేయంగా పోలీసుల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై మండపాల వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, నిబంధనలు మరియు పోలీస్ సూచనలపై నిర్వాహకులతో వివరంగా చర్చించనున్నారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు పట్టణ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పోలీసులు పిలుపునిచ్చారు.