సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు సంచలన ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవర్గాలు స్పష్టం చేశాయి. బాధిత తల్లి విజయలక్ష్మికి నష్టపరిహారంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది.