విద్యార్థులకు అలర్ట్: నవంబర్ లో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చే అవకాశం

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజ వంటి పలు పండగలతో పాటు ఆదివారాలు కలిసి రావడం వల్ల విద్యార్థులకు ఎనిమిది నుంచి పదమూడు రోజుల వరకు పాఠశాలలకు సెలవులు లభించే అవకాశం ఉందని విద్యావర్గాలు వెల్లడించాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా సెలవులు ఉండవని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విద్యాశాఖలు జారీ చేసే అధికారిక ఉత్తర్వులు లేదా అకడమిక్ క్యాలెండర్ ఆధారంగానే తుది సెలవులు ఖరారవుతాయని అధికారులు స్పష్టం చేశారు.