నెల్లూరులో గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు ప్రారంభం
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో గ్రామీణ విలేకరుల కోసం పునశ్చరణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వార్తా సేకరణ, రిపోర్టింగ్‌లో పాటించాల్సిన మెళకువలపై సీనియర్ జర్నలిస్టులు దిశానిర్దేశం చేశారు. క్రైమ్ రిపోర్టింగ్, ఫాక్ట్ చెకింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీశైలం రమేష్, నరేష్ నందం పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.