పోలవరం ప్రాజెక్టుకు పర్యాటక శోభ: కేంద్ర సహకారం కోరిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని జాతీయ రహదారులకు అనుసంధానించాలని అధికారుల ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో కోరారు. పుష్కరాల కన్నా ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు చర్యలు వేగవంతం చేశామని అధికారులు తెలిపారు.