అమెరికా వీసాలపై కొత్త నిఘా: అనామక ఫిర్యాదులతో విదేశీయులకు భారీ షాక్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
అమెరికా వీసా కలిగిన విదేశీయులపై ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. అక్రమాలు జరిగినట్లు ఎవరైనా సరే తమ పేర్లు వెల్లడించకుండానే నేరుగా అధికారులకు అనామక ఫిర్యాదులు చేసే కొత్త విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. దీనివల్ల ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన విద్యార్థులు, ఉద్యోగులు మరియు నిబంధనలు ఉల్లంఘించే వారి వివరాలు అధికారులకు సులభంగా చేరి తీవ్ర విచారణ ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.