బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.