టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: చెన్నై
పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి రాజీనామా చేసి తమిళగ వెట్రి కజగం పార్టీలో చేరిన ఆరుగురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు వెల్లడించిందని న్యాయవర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా చేసి మంత్రి కావడం రాజకీయ ప్రక్రియలో భాగమేనని ధర్మాసనం పేర్కొంది.