పార్టీ మారిన దానం నాగేందర్ పై హైకోర్టు వేటు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఈ తీర్పును స్వాగతించారు. పార్టీ మారిన మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.