వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తగినన్ని అవకాశాలు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. సిరీస్ దక్కించుకున్న తర్వాత కూడా అతడిని పక్కన పెట్టడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇషాన్ కిషన్ రీఎంట్రీ నేపథ్యంలో కుర్రాడిని పక్కన పెట్టడాన్ని కైఫ్ తప్పుపట్టారు.