తుఫాన్ నష్టాలపై మందసలో క్షేత్రస్థాయిలో సమీక్షించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో తుఫాన్ నష్టాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులతో కలిసి సమీక్షించారు. పంటలు, ఇళ్ల నష్టాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అర్హులందరికీ త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.