బెంగళూరు పబ్లో వీరంగం: ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్పై క్రిమినల్ కేసు నమోదు

రిపోర్టర్: సునీల్ స్థలం: కుప్పం

బెంగళూరులోని ఓ పబ్లో పోలీసులతో వాగ్వాదానికి దిగి అసభ్య పదజాలంతో దూషించిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్పై క్రిమినల్ కేసు నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీసులు ఆయనతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.