అన్నమయ్య జిల్లా ఆలయాలకు రూ.7.23 కోట్లతో నూతన మహర్దశ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వాల్మీకిపురం
అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం పట్టాభి రామస్వామి, తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల అభివృద్ధికి రూ.7.23 కోట్లతో శంకుస్థాపన జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ పనులను ప్రారంభించారు. టీటీడీ ఆధీనంలోని ఈ పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.