రాయలసీమ కరువుపై చంద్రగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుపతి
రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల ఎనభై ఎనిమిది మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందని చంద్రగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర కరువు మండలాలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. పంటలు ఎండిపోతున్న సమయంలో అన్నదాతలను పట్టించుకోకుండా, భారీ వేదికలపై రాయలసీమ రైజింగ్ అంటూ నినాదాలు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.