'సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి': సైఫాబాద్ పీఎస్ దాడి ఘటనపై హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు మహేష్ ముదిరాజ్, మహేందర్‌లపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, డీసీపీ శిల్పవల్లి దాడి జరగలేదంటూ చేసిన ప్రకటన అవాస్తవమని బీఆర్ఎస్ లాయర్లు వాదించారు. వాదోపవాదాల అనంతరం స్పందించిన హైకోర్టు, పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.