మద్యం దుకాణాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
మద్యం దుకాణాల పునరుద్ధరణ ప్రక్రియలో విజయనగరం జిల్లా మెరుగైన ఫలితాలు సాధించిందని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలసి ఎక్సైజ్, గనుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మిగిలిపోయిన దుకాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని, గరిష్ట స్థాయిలో లైసెన్స్ రుసుములు వచ్చేలా చూడాలని ఆదేశించారు. గనుల శాఖ ద్వారా ఆదాయం పెంచాలని, ఉచిత ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.