దిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ప్రముఖుల పేర్లలో వ్యత్యాసాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: దిల్లీ
దిల్లీలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బీజేపీ దిగ్గజం ఎల్.కె. అద్వానీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల పేర్లలో వ్యత్యాసాలను ఎన్నికల సంఘం గుర్తించింది. రికార్డుల సరిపోలిక లోపాల కారణంగా అద్వానీ కుటుంబం, కేజ్రీవాల్ కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు మ్యాపింగ్ కాలేదని ఈసీ వెల్లడించింది. కాగా తుది ఓటరు జాబితాను నవంబర్ 4న ప్రచురించనున్నారు.