మార్వాడీ వ్యాపార విస్తరణను వ్యతిరేకిస్తూ మాచారెడ్డిలో స్వచ్ఛంద బంద్
రిపోర్టర్: మహేష్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తాలో మార్వాడీ వ్యాపారాల విస్తరణను నిరసిస్తూ స్థానిక వ్యాపారులు శుక్రవారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో స్థానిక వ్యాపారుల ఉపాధి దెబ్బతింటోందని, నాణ్యత లేని వస్తువులతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్వాడీ వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వకూడదని కోరుతూ కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందజేసేందుకు తరలివెళ్లారు.