నీటి పొదుపుపై సోమిరెడ్డి కీలక పిలుపు.. ప్రతి బొట్టు అమృతం!
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, ప్రతి నీటి బొట్టును అమృతంగా భావించి పొదుపు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించి నీటి వృథాను అరికట్టాలని ఆయన కోరారు.
గతంలో తక్కువ నీటితోనే అధిక సాగు చేసిన అనుభవాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీటి పొదుపుపై ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.