హార్ముజ్ జలసంధి తెరిచేందుకు అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ దేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: టెహ్రాన్

హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచేందుకు అమెరికా అందించిన ప్రతిపాదనలు సరిపోవని, తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఎలాంటి చర్చలు జరగబోవని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ మొహ్సెన్ రెజాయ్ స్పష్టం చేసినట్లు ఇరాన్ రాష్ట్ర మీడియా ఆదివారం వెల్లడించింది. కొన్ని అంశాలపై స్పష్టత లేకపోవడంతో దౌత్యపరమైన ముందడుగు పడలేదని, అణు కార్యక్రమం ప్రస్తుతం ఎజెండాలో లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తేల్చిచెప్పారు.