షాకింగ్ ఘటన: మాదకద్రవ్యాల విక్రయాన్ని వ్యతిరేకించిన వ్యక్తి హత్యతో తీవ్ర కలకలం
రిపోర్టర్: అశోక్
స్థలం: Batala
పంజాబ్ రాష్ట్రంలోని బటాలా ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాన్ని నిలదీశాడన్న కారణంతో విక్రమ్జిత్ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు కిరాతకంగా హతమార్చారని స్థానికులు ఆరోపించారని సీనియర్ జర్నలిస్టు తెలిపారు. అయితే డ్రగ్స్ కోణం లేదని, మొబైల్ ఫోన్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందని బటాలా ఎస్పీ మెహతాబ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు.