చింతగూడ బడి దుస్థితిపై ప్రజావాణిలో కదంతొక్కిన పూర్వ విద్యార్థి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ జడ్పీ పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థి మేకల అక్షయ్ కుమార్ కోరారు. కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తరగతి గదుల పైకప్పులు పెచ్చులుడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.