కూటమి శ్రేణులతో గాజువాకలో ప్రత్యేక ఆత్మీయ సమావేశం
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
గాజువాక నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పదహారవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎనుబై ఎనిమిదో వార్డు పరిధిలోని యాదవ జగరాజుపేట గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. శాసనసభ్యులు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జనసేన ఇన్చార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్చార్జ్ కర్ణంరెడ్డి నరసింహారావు హాజరుకానున్నారు.