నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: సూర్యాపేట
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయిందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి వేదిక ద్వారా వేలాది మంది యువతీ యువకులకు ప్రయోజనం చేకూరిందని నిర్వాహకులు స్పష్టం చేశారు.