రైల్వే మార్గంలో అనుమానాస్పద పేలుడు కలకలం: ధ్వంసమైన రెండు సిమెంట్ స్తంభాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీగంగానగర్
రాజస్థాన్ లోని అనుప్‌గఢ్ - సూరత్‌గఢ్ రైలు మార్గంలో జరిగిన అనుమానాస్పద పేలుడు తీవ్ర కలకలం రేపిందని శ్రీగంగానగర్ ఎస్పీ హరిశంకర్ వెల్లడించారు. మంగళవారం రాత్రి 50 జీబీ గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో రైలు మార్గానికి ఆధారంగా ఉన్న రెండు సిమెంట్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. స్తంభాలు దెబ్బతినడానికి పేలుడు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.