నారాయణపేటలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం
రిపోర్టర్: గోపి
స్థలం: మహబూబ్ నగర్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద విద్యాభారతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ వెల్లడించారు. వందేమాతరం గీతం రచించి నూట ఏభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కోటికి పైగా ప్రజలు ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఆమె పేర్కొన్నారు.