ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై వైయస్ఆర్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Amaravati
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తూ క్రెడిట్ కొట్టేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శించారు. పింఛన్లు, డీఎస్సీ నియామకాలు మరియు ఉచిత గ్యాస్ సబ్సిడీ వంటి హామీలను పక్కనపెట్టి కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే జగన్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు ఆమె సవాల్ విసిరారు.