నిజామాబాద్‌లో వృద్ధురాలపై దాడి, చెవులు కోసి బంగారు కమ్మలు అపహరణ
రిపోర్టర్: సునీల్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌లో ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు నల్లా అరుంధతిపై దుండగుడు భీకర దాడి చేశాడు. మంచం కింద నక్కిన నిందితుడు నితిన్, ఆమె చెవులు కోసి బంగారు కమ్మలను దొంగిలించాడు. నగదు డిమాండ్ చేసి, ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.