తెలంగాణ ఎస్సై ఉద్యోగాల దరఖాస్తుకు సెప్టెంబర్ 16 ఆఖరు గడువు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎస్సై, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16తో ముగియనుంది. మొత్తం 275 ఖాళీల భర్తీకి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని TSLPRB బోర్డు సూచించింది. ఎంపికైన వారికి నెలకు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు వేతనం లభిస్తుంది. అర్హత ఉన్న నిరుద్యోగులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు కోరారు.