ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్ మీటర్లు: వర్ధన్నపేటలో ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారుల కోసం ఉచిత విద్యుత్ మీటర్లపై ప్రత్యేక అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. వరంగల్ రూరల్ డీఈ దానయ్య ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అర్హతలు, దరఖాస్తు విధానంపై పూర్తి అవగాహన కల్పించారు.