ముప్పై రెండేళ్ల క్రితం జంట హత్యల నిందితుడి అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

ఢిల్లీలో 1994లో జరిగిన సంచలన జంట హత్యలు మరియు దోపిడీ కేసులో ముప్పై రెండేళ్లుగా తప్పుించుకు తిరుగుతున్న లలిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. తూర్పు ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో ఇద్దరు సాధ్వులను గొంతు నులిమి హత్య చేసి నగదు, ఆభరణాలతో పరారైన ఈ ప్రధాన నిందితుడు మంగోల్పురి ఫేజ్-2లోని ఫ్యాక్టరీలో నకిలీ పేరుతో ప్యాకేజింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.