సినిమా అప్డేట్: సూర్య సీన్ చిత్రం నుండి అదిరిపోయే ట్రైలర్ విడుదల

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సీన్ చిత్రానికి సంబంధించి మేకర్స్ ట్రైలర్ విడుదల చేసినట్లు తెలిపారు. దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాగరం స్టూడియోస్, టూ డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఆరవ తేదీన విడుదల కానుంది.