నగరిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో అర్హులైన 107 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.