అచ్యుతాపురంలో ఘనంగా ఛాంపియన్ ప్రీమియర్ లీగ్ క్రీడలు

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురం మండలం సెజ్ దిబ్బపాలెంలో కేర్ అండ్ క్యూర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఛాంపియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలకు డాక్టర్ సునీల్, రాజాన విజయ్ కుమార్, బైలపూడి శ్రీరాందాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అతిథులు పేర్కొన్నారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాలం తాతారావు, ఎం. నవీన్, కేశవ్, జగదీష్ తదితర యూత్ సభ్యులు పాల్గొన్నారు.