మందమర్రి టు చందమామ: ఆకట్టుకునేలా చంద్రయాన్ సినిమా రాకెట్ రివీల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మందమర్రి నుంచి చందమామ ప్రయాణ నేపథ్యంలో తెరకెక్కిన చంద్రయాన్ సినిమా రాకెట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ఘనంగా రివీల్ చేసింది. ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా, దర్శకుడు వేణు ఊడుగుల సమర్పిస్తున్నారు. నవంబర్ 13న ఈ అడ్వెంచరస్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో నలుగురు కుర్రాళ్ల కలలతో ఈ చిత్రం రూపొందిందని ఆయన వివరించారు.