స్థానిక ఎన్నికల వ్యూహాలపై విశాఖలో జనసేన ఆత్మీయ సమావేశం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం సాగరమాల కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కూలంకషంగా చర్చించారు.