స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వార్నింగ్
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
స్థానిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బరిలో నిలిచే రెబల్స్‌పై కఠిన చర్యలు ఉంటాయని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.