మన్యంలో సరికొత్త వలిసెల విప్లవం: చింతపల్లి వన్ వంగడాలతో రైతులకు భారీ ఊరట
రిపోర్టర్: గోపి
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వలిసె పంట సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి స్పష్టం చేశారు. సుమారు ఏడేళ్ల పాటు జరిపిన పరిశోధనల్లో చింతపల్లి వన్ అనే కొత్త రకం అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నూనె గింజల సాగులో కీలకమైన ఈ వలిసె పంటను లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.