మురసు తుపాను ప్రభావం: కావలిలో నిలిచిన రైళ్లు, ప్రయాణికులకు సహాయం
రిపోర్టర్: అశోక్
స్థలం: కావలి
కావలి ప్రాంతంలో మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపించిందని రెడ్ క్రాస్ అధికారులు తెలిపారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో కావలి రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు రంగంలోకి దిగి తాగునీరు, బిస్కెట్లు, చిక్కీలు పంపిణీ చేసి గొప్ప మానవత్వం చాటుకున్నారు.