మహిళా వర్సిటీలో స్పేస్ అబ్జర్వేషన్ సెంటర్ ఏర్పాటు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో అత్యాధునిక హంగులతో స్పేస్ అబ్జర్వేషన్ సెంటర్ ఏర్పాటవుతోంది. ఈ నెల చివరి నాటికి ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. విద్యార్థినుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడం, ఆచరణాత్మక పరిశోధనకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా దీన్ని రూపుదిద్దుతున్నారు. ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, ఇమేజింగ్ తదితర రంగాల్లో ప్రత్యక్ష శిక్షణ అందించనున్నారు.