సెలెక్టర్ కుర్చీ ప్రమాదకరమంటూ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి ఎంత గౌరవప్రదమైనదో అంతే ప్రమాదకరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వీపుపై ఒక టార్గెట్ బోర్డు అమర్చినట్లే ఉంటుందని ఆయన హెచ్చరించారు. తాము చేసిన తొమ్మిది మంచి పనులను జనం మర్చిపోతారని, ఒక్క పొరపాటును వంద రెట్లు పెద్దది చేసి విమర్శిస్తారని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలెక్షన్ కమిటీ అంతర్గత వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయని ఆయన తెలిపారు.