ఐఐటీ చరిత్రలో తొలి మహిళా డైరెక్టర్‌గా ప్రీతి అగలాయం నియామకం
రిపోర్టర్: హరి
స్థలం: చెన్నై
చెన్నై ఐఐటీ పూర్వ విద్యార్థిని ప్రీతి అగలాయం చరిత్రాత్మక ఘనత సాధించారు. టాంజానియాలోని జాన్బార్లో ఏర్పాటు చేసిన ఐఐటీ మద్రాస్ తొలి అంతర్జాతీయ క్యాంపస్‌కు ఆమె డైరెక్టర్ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత పదవిని అధిరోహించడం ఇదే ప్రథమం. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధనలు చేసిన ఆమె, సైన్స్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెంపునకు విశేష కృషి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.