రాజీ మార్గంతోనే సత్వర న్యాయం లభిస్తుందని తెలిపిన జడ్జి

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాధురి మాట్లాడుతూ, రాజీ కుదిరే సివిల్ మరియు క్రిమినల్ కేసులను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు కూడా వృథా కాకుండా ఆదా అవుతాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.