నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిల్టన్ ప్రధాన్ జ్యుడీషియల్ రిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: నందిగ్రామ్
పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి మిల్టన్ ప్రధాన్ ను హత్య ఆరోపణల కేసులో హల్దియా సబ్ డివిజనల్ కోర్టు అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2007 నాటి భూసేకరణ వ్యతిరేక ఉద్యమ కేసుల్లో పరారీలో ఉన్నట్లు చెబుతున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపింది.