పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ సింగర్: త్వరలో రెండో వివాహం చేసుకోనున్న రిమి టామీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Kerala
తన రెండో వివాహం గురించి ప్రముఖ సింగర్, నటి రిమి టామీ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నవంబర్ నెలలో తన వివాహం జరగనున్నట్లు ఆమె ప్రకటించారు. ముంబైకి చెందిన ఫిట్ నెస్ కోచ్ లిబిన్ మాథ్యూను తాను పెళ్లాడబోతున్నట్లు రిమి టామీ స్పష్టం చేశారు. మార్చి నుంచి తమ పరిచయం ప్రేమగా మారిందని, కుటుంబ సభ్యులు మరియు అభిమానుల ఆశీస్సులతో ఈ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.